18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 3 రోజులే..
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత

Ap Assembly
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. వచ్చే నెల మూడో వారంలో జరిగే సమావేశాల్లో మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకునే అవకాశముంది.
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!
18, 19న అసెంబ్లీ సమావేశాల అనంతరం శని, ఆదివారాలు సెలవులు రానున్నాయి. అనంతరం 22వ తేదీన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆసరాపై అభినందనల తీర్మానంతో పాటు, ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితర అంశాలపైనా చర్చించనున్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?
నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుకి ఏడాది పాటు మైక్ ఇవ్వకూడదన్న ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదనపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అచ్చెన్నాయుడు, రామానాయుడుపై ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదనను ఆమోదించి ఏడాది పాటు చర్య తీసుకుంటే అప్పటివరకూ అసెంబ్లీకి రాకూడదనే అభిప్రాయంతో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తోంది.