AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..జగనన్న, వైఎస్‌ఆర్‌ చేయూత నిధుల విడుదలకు ఆమోదం

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న చేయూత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్రమోషన్ల ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23కు APCRDAలో ఫేజ్‌-1 ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీం, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్ల గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..జగనన్న, వైఎస్‌ఆర్‌ చేయూత నిధుల విడుదలకు ఆమోదం

AP Cabinet Key decisions

Updated On : September 7, 2022 / 6:13 PM IST

AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న చేయూత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్రమోషన్ల ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23కు APCRDAలో ఫేజ్‌-1 ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీం, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్ల గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.

భావనపాడు పోర్టు నోటిఫికేషన్‌-1లో సవరణలు చేయాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా..20 మంది ఖైదీలకు ఉపశమనం కలిగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో నోవాటెల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ అభివృద్ధికి ఆమోదం లభించింది. ఏపీజీఎస్‌టీ సవరణ డ్రాఫ్ట్‌ బిల్లు 2022కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

CM Jagan Warned Ministers : కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా?

వైఎస్‌ఆర్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కోసం..379 మంది లబ్ధిదారులకు ఏడో దశ పరిహారం చెల్లింపుకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి పట్టాలను రద్దు చేస్తూ భూమిని కార్పొరేషన్‌కు హ్యాండోవర్‌ చేయాలని నిర్ణయించారు. ఏపీ టెండెన్సీ యాక్ట్‌ 1956ను రీపిల్‌ చేసే డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఎక్స్‌పోర్ట్‌ పాలసీ 2020లో సవరణలకు ఆమోదం లభించింది. వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.