CM Jagan Warned Ministers : కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా?
మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు.

CM Jagan warned ministers
CM Jagan Warned Ministers : మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు. తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా స్పందించరా అని మంత్రులను సీఎం జగన్ ప్రశ్నించారు.
నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఆరోపణలను ఖండించకపోతే మీకు పదవులు ఎందుకు అంటూ మంత్రులపై సీఎం జగన్ మండిపడ్డారు. మరోసారి కేబినెట్ లో మార్పులు చేయమంటారా అని ప్రశ్నించారు. మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచించారు.