అదుపు తప్పితే ఊరుకోం : రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 10:12 AM IST
అదుపు తప్పితే ఊరుకోం : రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

Updated On : December 29, 2019 / 10:12 AM IST

అమరావతిలో రైతుల ఆందోళనలు చాలా సున్నితంగా చూస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాజధాని రైతులను కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని, వీరేవెరో గుర్తించామన్నారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకుంటే..ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇక్కడ ఆందోళనకారులు అదుపు తప్పితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గట్టిగా చేస్తే ఒక విధంగా..చేయకపోతే..మరొక విధంగా స్పందిస్తారని తెలిపారు. వంద మంది వస్తే..అందులో ఉన్న ఇద్దరు..కేకలు వేయడం..కొట్టండి అంటూ రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారనే తమ దృష్టికి వచ్చిందన్నారు. మరోవైపు మీడియాపై జరిగిన దాడిని ఏపీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉద్ధండరాయుని పాలెంలో విధి నిర్వాహణలో ఉన్న మీడియా ప్రతినిధిపై రైతుల ముసుగులో ఉన్న కొంతమంది దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వారు మందడం, వెలగపూడి, ఉద్ధరాయునిపాలెం వాసులుగా గుర్తించారు. ఈ కేసును స్వయంగా ఏపీ డీజీపీ సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు. దాడి జరిగిన తర్వాత..సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Read More : రాజధాని రైతుల పోరుబాట 12వ రోజు