ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు జరిగితే ఎస్పీలదే బాధ్యత: సీఈవో ముకేశ్ కుమార్ మీనా

ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు.

ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు జరిగితే ఎస్పీలదే బాధ్యత: సీఈవో ముకేశ్ కుమార్ మీనా

Mukesh Kumar Meena

ఎన్నికల్లో మీడియా పాత్రపై ఆయా సంస్థల ప్రతినిధులతో అమరావతిలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింస, రీపోలింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్థల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని తెలిపారు.

ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

ఎమ్మెల్యేకు రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలోనూ పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉందని చెప్పారు. కాగా, శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ