Chandrababu Naidu : చంద్రబాబుపై మరో కేసు.. ఏ3గా చేర్చిన సీఐడీ, విచారణకు కోర్టు అనుమతి
ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అనుమతించింది. Chandrababu Naidu

CID Another Case On Chandrababu
CID Another Case On Chandrababu : ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఏపీ సీఐడీ ఆయనపై ఇంకో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అనుమతించింది.
వెంటాడుతున్న కేసులు..
ఇప్పటికే పలు కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుని కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ సీఐడీ ఆయనపై మరో కేసు ఫైల్ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకి సంబంధించిన వేర్వేరు కేసులపై విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో తీర్పులు రిజర్వ్ లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో విచారణ వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పుని రిజర్వ్ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ పై తీర్పు రావాల్సి ఉంది.
Also Read : ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వైసీపీ గుండాలు దాడి దుర్మార్గం : కె.రామకృష్ణ
మద్యం కేసులో ఏ3 చంద్రబాబు..
ఈ పరిస్థితుల్లో చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, ఆ సమయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, కావాల్సిన కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సి ఉందంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో చంద్రబాబుని ఏ3గా చేర్చింది. దీనిపై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ముందస్తు బెయిల్ కి వెళ్తారా? కౌంటర్ దాఖలు చేస్తారా?
రేపు(అక్టోబర్ 31) ఈ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌంటర్ దాఖలు చేశాకే ఈ కేసుపై వాదోపవాదాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కి వెళ్తారా? ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసి విచారణకు వెళ్తారా? దీనిపై రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ కోర్టు సమయం ముగిసిపోవడంతో.. రేపు దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించే అవకాశం ఉంది.
Also Read : నాపై జరిగిన దాడి చిన్నది కాదు .. దీని వెనుక కుట్ర ఉంది : మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబుకి సంబంధించిన పలు కేసుల విచారణలు కోర్టుల్లో ఉండగానే.. చంద్రబాబుపై మరో కేసు నమోదు కావడం, విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.