అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏపీకి బిగ్ బూస్ట్- సీఎం చంద్రబాబు
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.

Cm Chandrababu On Amaravati Railway Line (Photo Credit : Google)
Amaravati Railway Line : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం ఆమోదించింది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు దీన్ని నిర్మిస్తారు. ఈ రైల్వే ట్రాక్ 57 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు 2వేల 245 కోట్ల రూపాయల వ్యయం కానుంది. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇరువురూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధిలో ఇది కీలకం కానుందని వ్యాఖ్యానించారు.
‘అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కొత్త రైల్వే లైన్ తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుంది. 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తవుతుంది. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నా. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏపీకి బిగ్ బూస్ట్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ కు ఆమోదం తెలపడం సంతోషం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
‘ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అమరావతి అభివృద్ధిలో ఇది కీలకం. ఐదేళ్ల సమయం వృథా అయ్యింది. వీలైనంత త్వరగా రైల్వే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరారు.
”అమరావతి రైల్వే లైన్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఏపీ ప్రజల కోరికను కేంద్రం నెరవేర్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో రైల్వే లైన్ కు మోదీ ఆమోదం తెలిపారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధం. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానం. కొత్త రైల్వే లైన్ తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం” అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read : మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా? ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉండే విషయాలే: జగన్