మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా? ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉండే విషయాలే: జగన్
తమ ఇంట్లో సమస్యను పెద్దదిగా చేసి చూపించడం సబబా అని అడిగారు.

Chandrababu-Jagan
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
తన తల్లి, చెల్లి పేర్లను బయటకు తీస్తూ కొందరు రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు. తమ ఇంట్లో సమస్యను పెద్దదిగా చేసి చూపించడం సబబా అని అడిగారు. తన కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్న వారి కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా అని నిలదీశారు. ఇటువంటివి ప్రతి ఇంట్లోనూ ఉండే విషయాలేనని అన్నారు.
వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుందని చెప్పారు. నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.
ఎన్నో సమస్యలు ఉంటే కప్పిపుచ్చేందుకు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు కనీస భద్రత ఇవ్వలేని స్థితిలో పోలీసులున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పటిష్ఠ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు గ్రామ స్వరాజ్యం ఎలా ఉందో గుర్ల గ్రామాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని అన్నారు. డయేరియాతో 14 మంది మృతి చెందారని, కనీసం సమాచారం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు.
Viral Video: చిరాకు వచ్చి కార్లను ఫ్లైఓవర్ మీదే వదిలేసి వెళ్లిపోయిన బెంగళూరు వాసులు