Power Tariff Hike : విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు.

Power Tariff Hike : విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Updated On : January 1, 2025 / 9:31 PM IST

Power Tariff Hike : విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పదవి నుంచి దిగిపోతూ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న జగన్.. కూటమి ప్రభుత్వం పెంచిందనటం దుర్మార్గం అని మండిపడ్డారు. ఒక్క విద్యుత్ రంగంలోనే లక్షా 29 వేల కోట్ల రూపాయల అప్పు చేసి జగన్ దిగిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..
విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. విద్యుత్ రంగంతో పాటు వివిధ రంగాల్లో జగన్ చేసిన పాపాలు అనేకం అని చంద్రబాబు అన్నారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని తెలిపారు. సెకీ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు చంద్రబబు. దెబ్బతిన్న రహదారుల్లో మార్పు కనిపిస్తోందన్నారు. జగన్ పట్టించుకోని రహదారులన్నింటిని మేమే బాగుచేస్తున్నామన్నారు చంద్రబాబు.

”వివిధ అక్రమాల్లో జగన్ మాకు లడ్డూలా దొరికారు. విద్యుత్ రంగంలో జగన్ లక్ష 29వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు బటయపడుతున్నాయి. జగన్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు. జగన్ పట్టించుకోని రహదారులను మేమే బాగు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Also Read : భారత్ పై కుట్ర చేయడం కాదు, ఆ ఆలోచన చేయాలన్నా వణుకే..! ఇండియా అమ్ములపొదిలోకి గేమ్ ఛేంజర్ వెపన్స్..

కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట..
కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో అధికార పక్షాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆందోళన బాట పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలపై రూ.15వేల 485 కోట్ల భారం మోపిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా.. వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించింది.

అధికారంలోకి రాగానే ఛార్జీల బాదుడు..
విద్యుత్ బిల్లుల బాదుడుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో వైసీపీ నుంచి విమర్శలు వస్తుండటంతో సీఎం చంద్రబాబు స్పందించారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తేల్చి చెప్పారు.

 

Also Read : వారిని కంట్రోల్ చేస్తున్నా.. పదే పదే హెచ్చరిస్తున్నా: చంద్రబాబు