Cm Chandrababu: నీళ్ల విషయంలో రాజకీయాలు సరికాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దు- సీఎం చంద్రబాబు

సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. Chandrababu

Cm Chandrababu: నీళ్ల విషయంలో రాజకీయాలు సరికాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దు- సీఎం చంద్రబాబు

Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 5:00 PM IST

 

  • సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముంది
  • రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
  • గోదావరి నీళ్లు మంజీరాకు తీసుకెళ్తే మేము అభ్యంతరం చెప్పలేదు

Cm Chandrababu: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణ నేతలను కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు..

గోదావరి నీళ్లు మంజీరాకు తీసుకెళ్తే మేము అభ్యంతరం చెప్పలేదు అని గుర్తు చేశారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు అని చంద్రబాబు నిలదీశారు. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని హితవు పలికారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దని చంద్రబాబు అన్నారు. మేము చేసిన పనుల వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు.

జగన్ అక్రమాలను విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీవి నీచ రాజకీయాలు అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అనుమతులు లేని ప్రాజెక్ట్ లకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వైసీపీ చీఫ్ జగన్ అక్రమాలను విచారించాలంటే 30 ఏళ్లు పడుతుందన్నారు చంద్రబాబు. ఒకటి కాదు రెండు కాదు వ్యవస్థలన్నింటినీ జగన్ కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలతో కాలయాపన చేయలేము అని హాట్ కామెంట్స్ చేశారు.

Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం.. ఏపీలోని రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు ఎలా దారితీసింది?