CM Chandrababu Naidu : తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను ఇవ్వాలి : సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP CM Chandrababu : వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

CM Chandrababu Naidu : తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను ఇవ్వాలి : సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP CM Chandrababu

Updated On : December 12, 2024 / 4:37 PM IST

CM Chandrababu Naidu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం ఇక్కడ అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పింఛన్లకు సంబంధించి చర్చలో ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

ప్రతి ఏటా జాబితాను సిద్దం చేసి అప్‌డేట్ చేయాలన్నారు. త్వరలోనే చిన్నారుల పింఛన్లకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Read Also : Handcuffs To Farmer : రైతుకు బేడీలు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్