ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

CM Jagan Gannavaram Airport: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అమెరికాలోని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ తుళ్లూరు లోకేశ్ గా పోలీసులు గురించారు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉన్నట్టు తెలిసింది.
కాగా, సీఎం జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు సమాచారం. దీని గురించి పోలీసులు అతడిని ప్రశ్నించారు. జగన్ విదేశాలకు వెళ్లే సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావని అడగ్గా తనకు గుండెపోటు వచ్చిందని కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్ తుళ్లూరు లోకేశ్ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Also Read: ఏపీలో ఎన్నికల హింసపై 13 మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే