YS Jagan Mohan Reddy : రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం

YS Jagan Mohan Reddy : రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

AP CM YS Jagan

Updated On : January 2, 2022 / 4:09 PM IST

YS Jagan Mohan Reddy :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చింనున్నట్లు ప్రాధమిక సమాచారం.

Also Read :Murder : మద్యం మత్తులో కత్తులతో దాడి-ఇద్దరు మృతి

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. దీంతో ఈ పర్యటనలో జగన్ వాటి విషయమై కేంద్ర మంత్రులతో చర్చించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు విభజన హామీలు, మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని ముఖ్యులతో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఇలా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు గన్నవరం  విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. మిగిలిన కేంద్ర మంత్రుల నుంచి వచ్చిన అపాయింట్ మెంట్ లను బట్టి సీఎంజగన్ ఢిల్లీలో ఒక రోజు ఉండనున్నారు.