CM Jagan: తిరుమలకు సీఎం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

CM Jagan: తిరుమలకు సీఎం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

Jagan Reddy (1)

Updated On : October 11, 2021 / 4:45 PM IST

CM Jagan: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి, ఎమ్మెల్యే రోజా సీఎంకు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లకు చెందిన పలువురు నేతలు రేణిగుంట విమానాశ్రయానాకి చేరుకుని ముఖ్యమంత్రికి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం జగన్‌.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు పయనమైన ముఖ్యమంత్రి మూడు గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

ముఖ్యమంత్రి మొదటి రోజు(సోమవారం)పర్యటన వివరాలు..
► రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి.
► అనంతరం అలిపిరికి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు.
► అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.

రెండవరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి కార్యక్రమాలు:
► మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు.
► అక్కడ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు.
► అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి.. అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు.
► అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనమవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.