AP CM YS Jagan : రెండేళ్లలో 95 శాతం హామీలు పూర్తిచేశాము

దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

AP CM  YS Jagan : రెండేళ్లలో 95 శాతం హామీలు పూర్తిచేశాము

Ap Cm Ys Jagan Speech On His Two Years Rule

Updated On : May 30, 2021 / 3:20 PM IST

AP CM YS Jagan :  దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఆయన గుంటూరు జిల్లా, తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ… ‘‘ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు .. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని అన్నారు.

వ్యవస్ధలో మార్పు తీసుకువచ్చి సంక్షేమ పధకాలు ప్రజల గడప వద్దకే అందించామని…దేవుడి దయతో ప్రజలందరి దీవెనతో ఈ హామీలు నెరవేర్చగలిగామని ఆయన చెప్పారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇవ్వగలిగామని… ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను అని ఆయన అన్నారు. మీరు ఇచ్చిన ఈ అధికారంతో అనుక్షణం.. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఈస్ధాయిలో సంక్షేమ పధాకాలు అందేందుకు తోడుగా నిలిచి సహకరించిన ప్రతి గ్రామ వాలంటీర్ కు సీఎం ధన్యవాదాలు చెప్పారు. ప్రతి ప్రభుత్వ అధికారి, ఉద్యోగి సహకారంతోనే ఇది చేయగలిగామని ఆయన అన్నారు. ఈరెండు సంవత్సరాలకాలంలో మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేశామని.. మ్యానిఫెస్టోని బైబిల్, ఖురాన్ భగవద్గీతగా భావించి ప్రతి అంశము అమలు చేసేందుకు కృషిచేశామని.. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో అభివృధ్ధిలో ఉన్నవాటి గురించి వివరిస్తూ రూపోందించిన పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

ఈ రెండేళ్లలో 94.5 శాతం హామీలు పూర్తిచేసామని గర్వంగా చెపుతున్నానని ఆయన అన్నారు. 66 శాతం పధకాలన్నీ అక్కచెల్లెమ్మలకే చెందుతున్నాయని ఆయన వివరించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి ఆశీస్సులతో రాబోయే 3 ఏళ్లలో ప్రతి హామీని నేరవేరుస్తూ అడుగుముందుకు వేసేందుకు శక్తి ఇవ్వమని దేవుడ్ని వేడుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు.