Andhrapadesh : ఏపీని వణికిస్తున్న వైరస్, 24 గంటల్లో 22, 018 కేసులు, 96 మంది బలి

ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది.

Andhrapadesh : ఏపీని వణికిస్తున్న వైరస్, 24 గంటల్లో 22, 018 కేసులు, 96 మంది బలి

Ap Covid

COVID-19 Cases : ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది. 96 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీని కారణంగా అనంతలో 11 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, విశాఖపట్టణంలో 10 మంది, పశ్చిమ గోదావరిలో 10 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, కృష్ణాలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కడపలో నలుగురు మరణించారు.

గడిచిన 24 గంటల్లో 19 వేల 177 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం వరకు రాష్ట్రంలో 1,77,91,220 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 13,85,908 పాజిటివ్ కేసులకు గాను..11 లక్షల 72 వేల 948 మంది డిశ్చార్జ్ కాగా..9 వేల 173 మంది మృతి చెందారని..ప్రస్తుతం 2,03,787 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 2213. చిత్తూరు 2708. ఈస్ట్ గోదావరి 3432. గుంటూరు 1733. వైఎస్ఆర్ కడప 1460. కృష్ణా 1031. కర్నూలు 1213. నెల్లూరు 1733. ప్రకాశం 1265. శ్రీకాకుళం 695. విశాఖపట్టణం 2200. విజయనగరం 899. వెస్ట్ గోదావరి 1436. మొత్తం : 22,018.

Read More : భారత్ లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం..హైదరాబాద్ లో తొలి డోస్