AP Covid-19 Live Updates: ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు, 42 మంది మృతి

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 42 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,102 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 66,944 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 5,292 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 42 మంది మృతిచెందారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 63,49,953 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఏపీలో కరోనా కేసులు 7,39,719 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 6,128 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 48,661 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,84,930 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, నెల్లూరులో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.