AP Covid : ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.

Ap Corona Cases
AP Covid : ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి. నిన్న 429 కేసులు నమోదవగా, తాజాగా 671 కేసులు నమోదయ్యాయి.
Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41వేల 523 కరోనా పరీక్షలు చేయగా, 671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 102 కేసులు, గుంటూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 74, కృష్ణా జిల్లాలో 66, తూర్పు గోదావరి జిల్లాలో 65 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు, అనంతపురం జిల్లాలో 9 కేసులు గుర్తించారు.
Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!
అదే సమయంలో 1,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,30,503 మంది కోలుకున్నారు. ఇంకా 9వేల 141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,219కి పెరిగింది.
#COVIDUpdates: 05/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,50,968 పాజిటివ్ కేసు లకు గాను
*20,27,608 మంది డిశ్చార్జ్ కాగా
*14,219 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,141#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jF2lTW9YeG— ArogyaAndhra (@ArogyaAndhra) October 5, 2021