Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!

ఇంటర్నెట్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ వాడుకుంటున్న పరిస్థితి, ఇది ప్రతిఒక్కరి అవసరంగా మారిపోయింది.

Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!

Wifi

Internet: ఇంటర్నెట్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ వాడుకుంటున్న పరిస్థితి, ఇది ప్రతిఒక్కరి అవసరంగా మారిపోయింది. కరోనా కారణంగా ఆఫీసు పనిని కూడా ఇంట్లోనే(Work From Home) చేసుకుంటూ ఉండడంతో ఇంటర్నెట్ కావల్సి వస్తుంది. కరోనా పరిస్థితుల్లో ఇంటర్నెట్ వినియోగం చాలా వేగంగా పెరిగింది. ఆఫీసులు తెరిచినప్పటికీ, సామాజిక దూరం కారణంగా.. చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, వైఫై పని చేసేటప్పుడు స్లో అయిపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు.

అయితే, Wi-Fi వేగాన్ని పెంచడానికి చిన్న చిట్కాలు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పని చేస్తున్నప్పుడు, మీ ఇంటర్నెట్ సిగ్నల్ ఇరుక్కుపోయి, మీ పని ఆగిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో, కొన్ని దశలను దశలవారీగా అనుసరించడం ద్వారా ఇంటర్నెట్‌కు సంబంధించిన ఎలాంటి సమస్య రాకపోవచ్చునని చెబుతున్నారు టెక్ నిపుణులు.

ఇంట్లో పని చేస్తున్నప్పుడు మీ ఇంటర్నెట్ స్లో అయితే, దీనికి పెద్ద కారణం Wi-Fi రూటర్.. మీ పరికరం మధ్య దూరం కావచ్చు. మీరు దాని పరిధికి బయట ఉంటే బలమైన సిగ్నల్ అందదు. మీరు రౌటర్‌కి దగ్గరగా పనిచేస్తే, ఇంటర్నెట్ వేగం మెరుగ్గా ఉంటుంది. రూటర్‌ను గదిలోనే ఉంచుకుంటే, సిగ్నల్ మీ గాడ్జెట్‌కి ఎలాంటి ఆటంకం కలిగించదని చెబుతున్నారు.

వైఫై రూటర్ సెట్టింగులను మార్చండి:
వైర్‌లెస్ సెట్టింగ్‌లకు వెళ్లి, అక్కడ నుండి అడ్వాన్స్‌డ్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. అక్కడ మీరు ఛానెల్‌ని ఎంచుకోవడం ద్వారా సెట్టింగ్‌ని సేవ్ చేయాలి. దీని తరువాత రౌటర్ రీస్టార్ట్ చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా కొత్త సెట్టింగ్‌తో రౌటర్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది మరియు మీ నెట్ స్పీడ్ పెరుగుతుంది.

యాప్ ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించండి:
ఈ పరిహారం ఉన్నప్పటికీ, మీ ఇంటర్నెట్ వేగం మీరు అనుకున్న స్థాయిలో లేకపోతే, Wi-Fi విశ్లేషణ యాప్ ద్వారా మీరు వైఫై ఫ్రీక్వెన్సీ ఛానెల్‌ని విశ్లేషించవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు ఛానెల్‌లను తీసివేయాల్సి ఉంటుంది. దీని కోసం, మీరు రౌటర్ సెట్టింగ్‌లకు వెళ్లి మీ ID- పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

స్పీడ్‌టెస్ట్ మాస్టర్:
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించడానికి స్పీడ్‌టెస్ట్ మాస్టర్ సులభమైన అప్లికేషన్. ఇది 4జీ, డీఎస్‌ఎల్‌, 5జీ, ఏడీఎస్‌ఎల్‌ వంటి వివిధ నెట్‌వర్క్‌ల వేగాన్ని పరీక్షించే అవకాశం ఉంది. అంతేకాదు మోటియోర్‌ అనే యాప్‌ ద్వారా కూడా స్పీడ్ కొలవచ్చు. అయితే, అతి తక్కువ స్థాయిలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ను కొలవవచ్చు.