Adityanath Das : జలవివాదంపై జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ
కృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీం కోర్టు తలుపు తట్టామని ఆంధ్ర ప్రదేశ్ తెలిపింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఏపీ నీటి వాటాను కోల్పోయే విధంగా తెలంగాణ వ్యవహరిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Adityanath Das
Adityanath Das : కృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీం కోర్టు తలుపు తట్టామని ఆంధ్ర ప్రదేశ్ తెలిపింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఏపీ నీటి వాటాను కోల్పోయే విధంగా తెలంగాణ వ్యవహరిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
సాగు నీటి అవసరాలతో సంబంధం లేకుండా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుందని దీని వలన ఏపీకి అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం మినహా మరో అవకాశం లేదని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా తాము పిటిషన్ వేయలేదని స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల్లో నీటి వినియోగం నిబంధనలను 2014ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ ఉల్లంగిస్తుందని ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.
తెలంగాణ వైఖరిని మరోసారి కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తెస్తున్నట్లు సీఎస్ వివరించారు. కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు పరిధిని వీలైనంత త్వరగా నిర్ణయించాలని కోరారు.