వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన డీజీపీ… వారికి కీలక ఆదేశాలు జారీ..
మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజీలు, డీఐజీలు పలువురు ఎస్పీలు ఉన్నారు.

AP DGP Memo (Photo Credit : Google)
AP DGP Memo : వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బిగ్ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్‌లకు ఆయన మెమో జారీ చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆ ఐపీఎస్‌లను ఆదేశించారు డీజీపీ. వెయిటింగ్ హాల్‌లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజీలు, డీఐజీలు, పలువురు ఎస్పీలు ఉన్నారు.
వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లు..
డీజీపీ స్థాయి అధికారులు- పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్
అదనపు డీజీ-సంజయ్
ఐజీలు- కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి
డీఐజీలు-అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని
వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ స్థాయి ఐపీఎస్‌లు..
రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, అన్బురాజన్.
ఐపీఎస్‌లు రోజూ సంతకాలు పెట్టాల్సి రావటం దురదృష్టకరం- జేసీ ప్రభాకర్ రెడ్డి
వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ మెమో ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కండీషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావటం దురదృష్టకరం అన్నారాయన. ప్రజలను, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరం అని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు.
Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! జోగి రమేశ్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం