Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు.. ఏఏ స్టేషన్లో ఆగుతుందంటే?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు.. ఏఏ స్టేషన్లో ఆగుతుందంటే?

Special Trains

Updated On : May 12, 2024 / 7:42 AM IST

AP Election 2024 Special Train : ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు 13న పోలింగ్ జరగనుంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.  హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు, ట్రైన్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి బస్టాప్ లు, రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల భారీ రద్దీ కనిపించింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read : Ap Elections 2024 : ఏపీలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. అక్రమాలు జరగకుండా ఈసీ గట్టి నిఘా

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి (రైలు నెం. 07097) మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ పట్టణం చేరుకుంటుంది. సోమవారం రాత్రి 7.50 గంటలకు విశాఖపట్టణం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి (రైలు నెం. 07098) మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అదేవిధంగా ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : Police Seize Money : ఎన్నికల వేళ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో కలకలం.. భారీగా నగదు స్వాధీనం

సికింద్రాబాద్ – విశాఖపట్టణంకు వెళ్లే స్పెషల్ ట్రైన్.. ఏఏ స్టేషన్ లో ఆగుతుందో ఇక్కడ చూడొచ్చు.. 

SpecialTrains between Secunderabad and Visakhapatnam

SpecialTrains between Secunderabad and Visakhapatnam