వైసీపీ 6వ జాబితా విడుదల

పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్.

వైసీపీ 6వ జాబితా విడుదల

YCP Sixth List Out

Updated On : February 2, 2024 / 10:55 PM IST

YCP Sixth List : వైసీపీ ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితా విడుదలైంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్. 6వ లిస్టులో 10 మార్పులు జరిగాయి. ఇందులో 4 లోక్ సభ, 6 అసెంబ్లీ ఇంఛార్జ్ లు ఉన్నారు. ఇంఛార్జిల మార్పులకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు 6 జాబితాలు రిలీజ్ చేసింది. మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను మార్చేసింది.

పార్లమెంట్ ఇంఛార్జిలు..

రాజమండ్రి.. గూడూరి శ్రీనివాస్

నర్సాపురం.. అడ్వకేట్ గూడూరి ఉమాబాల

గుంటూరు.. ఉమ్మారెడ్డి వెంకటరమణ

చిత్తూరు.. ఎన్.రెడ్డప్ప

అసెంబ్లీ..

మైలవరం.. తిరుపతిరావు యాదవ్

మార్కాపురం.. అన్నా రాంబాబు

గిద్దలూరు.. నాగార్జున రెడ్డి

జీడీ నెల్లూరు .. నారాయణ స్వామి

నెల్లూరు సిటీ .. ఎండీ ఖలీల్(డిప్యూటీ మేయర్)

ఎమ్మిగనూరు.. బుట్టా రేణుక

Also Read : టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ

ఏలూరు
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఆడ్వకేట్ గూడూరి ఉమా బాల నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప.గో జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఉమాబాల
గతంలో కౌన్సిలర్ గా భీమవరం మున్సిపల్ ఛైర్ పర్సన్ గా పని చేసిన అనుభవం
కాంగ్రెస్ పార్టీలోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనూ వివిధ హోదాల్లో పని చేసిన ఉమాబాల

కర్నూలు
ఎమ్మిగనూరు ఇంచార్జ్ మాచాని వెంకటేష్ ను మార్చిన అధిష్టానం
మాజీ ఎంపీ బుట్ట రేణుకాను ఎమ్మిగనూరు ఇంచార్జ్ గా ప్రకటించిన అధిష్టానం
కర్నూలు ఎంపీ ఇంచార్జ్ ని ప్రకటించని అధిష్టానం
కర్నూలు ఎంపీ అభ్యర్థి విషయంలో ప్రతిష్టంభన
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామా? లేక బీవై రామయ్య? అనే సందిగ్ధంలో వైసీపీ శ్రేణులు

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?

చిత్తూరు పార్లమెంట్ విషయంలోనూ వైసీపీ నిర్ణయం రివర్స్ అయ్యింది. చిత్తూరు ఎంపీ, గంగాధర నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లను తిరిగి పాత వారికే కట్టబెట్టింది అధిష్టానం. చిత్తూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ కు, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపుతూ ఇదివరకు జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.

6వ జాబితాలో మళ్ళీ నిర్ణయం వెనక్కు తీసుకుంది. రెడ్డెప్పను చిత్తూరు ఎంపీ స్థానానికి, నారాయణస్వామిని గంగాధర నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేసేలా తాజాగా పార్టీ డెసిషన్ తీసుకుంది. తిరుపతి పార్లమెంటు విషయంలోనూ ఇదే తరహాలో ఇదివరకు నిర్ణయం తీసుకొని, మళ్లీ వెనక్కు తగ్గిం వైసీపీ అధినాయకత్వం. పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో వైసీపీ హైకమాండ్ మీనమేషాల వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అటు.. అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డిని రీజినల్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, దీంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావుని డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ గా నియమించింది. రీజినల్
కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ గా పని చేస్తారని వైసీపీ అధినాయకత్వం తెలిపింది.