Shankara Narayana : మా ఫ్యామిలి గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా.. నారా లోకేశ్ పై మాజీ మంత్రి శంకర నారాయణ ఫైర్
టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ‘మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Shankara Narayana
Shankara Narayana : టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ‘మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శంకర నారాయణ మాట్లాడారు. తమ గురించి, తమ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లోకేశ్ కు లేదన్నారు. లోకేశ్ తాతకి రెండు ఎకరాల భూమే ఉండేదని.. తమ తాతకు 50 ఎకరాలు ఉండేదని తెలిపారు.
లోకేష్ కు శంకర నారాయణ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన మీద చేసిన ఆరోపణలను నారా లోకేశ్ వచ్చీ రుజువు చేయాలన్నారు. నేను తప్పు చేసివుంటే తల వంచుతానని, అవి అసత్యాలని రుజువు అయితే నీ నాలుక కోస్తా అంటూ లోకేశ్ ను ఉద్ధేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. లోకేశ్ ఒక్కడే రావాలని, ఆయన చెంచాలు నిమ్మల, పార్థ సారథి, కమ్మ సవిత వస్తానంటే కుదరదన్నారు.
Lokesh On Liquor Deaths : శవ రాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్-నారా లోకేష్
తాను ఇక్కడే ఉంటా దమ్ముంటే ఒక్కడే రా తేల్చుకుందామని సవాల్ చేశారు. అనకొండ అని తనను అన్నావని, సరే తాను అనకొండనే అని అన్నారు. అయితే, తన కార్యకర్తలను కాపాడుకునేందుకు తన ప్రజలకు మంచి పాలన అందించేందుకు తాను అనకొండనే అని అన్నారు.
జగన్ ను గురించి మాట్లాడే అర్హత లోకేశ్ కు లేదన్నారు. జగన్ కనుసైగా చేస్తే బట్టలు విప్పి జిల్లా దాటే వరకు తరిమి తరిమి కొడతామం అని అన్నారు. లోకేశ్ కు నాలుక మందం, మాట్లాడటం సరిగా రాదని ఎద్దేవా చేశారు. అసలు లోకేశ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పతనం అయ్యిందని ఎద్దేవా చేశారు.