AP Govt Financial Assistance : మాండౌస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

AP Govt Financial Assistance : మాండౌస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

AP government

Updated On : December 12, 2022 / 12:29 PM IST

AP Govt Financial Assistance : మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో తుపాను తీవ్రత తగ్గింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అధించాని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని ఆదేశించింది.

Mandous Cyclone : వాయుగుండంగా మారిన మాండూస్ తుపాను.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు

తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, తరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ ఆర్ జిల్లాలో ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాల్లోని తుపాన్ బాధితులకు ఆర్థిక సాయం అందనుంది.