AP Government: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది ఆ రోజే.. డేట్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు..
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు.

AP Fishermens
AP Government: ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కరికి రూ.20వేలు అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 26వ తేదీన మత్స్యకారులకు ఈసాయాన్ని అందించనుండగా.. సీఎం చంద్రబాబు చేతులుమీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈనెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మత్స్యకార భరోసాను లాంఛనంగా ప్రారంభిస్తారు. స్వయంగా మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి ముఖ్యమంత్రి అందజేయనున్నారు. కూటమి ప్రభుత్వం రూ.20వేలు మత్స్యకార భృతి ఇస్తుందని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే మంత్రివర్గంలో ఆమోదించి.. ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
Also Read: Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్.. ఆమె మరిది అరెస్ట్ ..
26వ తేదీన అమరావతి నుంచి విశాఖ మీదుగా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడి మత్స్యకారులకు భృతిని అందజేసి వారితో ముఖాముఖిలో పాల్గొంటారు. ప్రజావేదిక నిర్వహించడంతోపాటు పార్టీ నేతలతోనూ చంద్రబాబు సమవేశం అవుతారు. సాయంత్రం తిరిగి విశాఖ మీదుగా అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు.