మహిళలకు మెటర్నిటీ లీవ్‌లను భారీగా పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది.

మహిళలకు మెటర్నిటీ లీవ్‌లను భారీగా పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Updated On : May 5, 2025 / 9:10 PM IST

మహిళలకు ఇచ్చే మెటర్నిటీ లీవ్‌లను 120 రోజుల నుంచి 180 రోజుల వరకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది.

ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు మహిళలకు ఉద్యోగం నుంచి విరామం తీసుకునేలా మెటర్నిటీ లీవులు ఇస్తారు.

Also Read: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌కు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. సైరెన్లు మోగిస్తారు.. ఇంకా ఏమేం చేస్తారంటే?

పీపీపీ మోడల్‌లో వైజాగ్‌లో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో భాగంగా పీపీపీ పద్ధతిలో మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు.