Suspense on Parishad elections : పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం, ఎస్ఈసీ

ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి.

Suspense on Parishad elections : పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం, ఎస్ఈసీ

Ap Government Sec Challenging Single Bench Verdict On Parishad Elections

Updated On : April 6, 2021 / 7:33 PM IST

Suspense on Parishad elections : ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి. డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ఇవాళ రాత్రికి విచారణ జరిపే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 21 రోజుల కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని.. అందుకే నోటిఫికేషన్ రద్దు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. 21 రోజుల సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదంటూ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఎన్నికల కోడ్‌కు 21 రోజుల సమయం లేనందున పరిషత్ ఎన్నికలు నిర్వహించలేనని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ చెప్పారు.

ఇప్పుడు వర్ల రామయ్య ఇదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

మరోవైపు.. బీజేపీ, జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి సంబంధించిన విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వాస్తవానికి ఎల్లుండి పోలింగ్ జరగాల్సి ఉంది. 10 తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.