NTR Health University Name Change : ఎన్టీఆర్‌ హెల్త్‌వర్సిటీ పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం

ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

NTR Health University Name Change : ఎన్టీఆర్‌ హెల్త్‌వర్సిటీ పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం

NTR Health University name change

Updated On : November 1, 2022 / 2:43 PM IST

NTR Health University Name Change : ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఇకపై ఎన్టీఆర్‌ వర్సిటీ బదులు డాక్టర్ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీగా పేరు అధికారికంగా మారినట్లైంది. గత రెండు నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్‌ వర్సిటీ పేరుమార్పుపై బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Balakrishna : మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వంపై బాలయ్య ఫైర్..

చివరకు అసెంబ్లీ ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గవర్నర్‌కు పంపగా రెండు నెలల అనంతరం పేరు మార్పుకు గవర్నర్‌ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.