APSRTC Bus Accident : బస్సు ప్రమాద సంఘటన పట్ల ఏపీ గవర్నర్ విచారం

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

APSRTC Bus Accident : బస్సు ప్రమాద సంఘటన పట్ల ఏపీ గవర్నర్ విచారం

Ap Governor Condolence

Updated On : December 15, 2021 / 2:50 PM IST

APSRTC Bus Accident :  పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు  చేసుకుంది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మరణించగా, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ హరిచందన్.. సహాయ చర్యలు వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలన్నారు.