Welfare Schemes : ఒక్కొక్కరికి రూ.18,500.. జూన్‌లో అమలయ్యే సంక్షేమ పథకాల తేదీలు ఖరారు

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా జూన్‌లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం నిర్ణయించింది.

Welfare Schemes : ఒక్కొక్కరికి రూ.18,500.. జూన్‌లో అమలయ్యే సంక్షేమ పథకాల తేదీలు ఖరారు

Welfare Schemes And Dates

Updated On : May 16, 2021 / 8:01 AM IST

Welfare Schemes And Dates : కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా జూన్‌లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం నిర్ణయించింది.

జూన్ 8న – జగనన్న తోడు
జూన్ 15న – వైఎస్ఆర్ వాహన మిత్ర
జూన్ 22న – వైఎస్ఆర్ చేయూత

చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చేతి వృత్తుల వారికి జగనన్న తోడు పథకం కింద జూన్ 8న ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందించనుంది. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.10వేల సాయాన్ని జూన్ 15న ఇవ్వనుంది. ఇక అర్హులైన 45-60 ఏళ్ల మధ్య మహిళలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద రూ.18వేల 500 చొప్పున జూన్ 22న సాయాన్ని ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఈ పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందజేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు.