కార్పొరేట్ లుక్‌లో ఆస్పత్రులు : సెంట్రలైజ్డ్ ఏసీ తప్పనిసరి : సీఎం జగన్

CM Ys Jagan : ఏపీలో దాదాపు 7 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆస్పత్రుల నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆయన అధికారులకు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఆస్పత్రుల నిర్మాణాలుండాలని జగన్ తెలిపారు. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు కార్పొరేట్ లుక్ (hospitals Corporate Look) కనిపించాలని సీఎం సూచించారు. ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్ ఏసీ (Centralized AC) ఉండాలని సీఎం జగన్ సూచించారు. డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా వైద్యం చేస్తారని ఆయన చెప్పారు.
అవసరమైతే సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. దాని వల్ల యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.50కే వస్తుందన్నారు. ప్రతి ఆస్పత్రి బెస్ట్ గా ఉండాలని జగన్ ఆకాంక్షించారు.