AP PRC : కీలక పరిణామం.. చర్చలకు రావాలని మరోసారి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం పిలుపు
చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు..

Ap Prc Talks
AP PRC : పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సై అంటే సై అనే పరిస్థితి ఏర్పడింది. ముందు చర్చలకు రండి.. అని ప్రభుత్వం అంటుంటే, ముందు మా డిమాండ్లు పరిష్కరించండి తర్వాతే చర్చలు అని ఉద్యోగ సంఘాలు పట్టు పట్టాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు అధికారికంగా లేఖ రాసింది.
Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!
సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగ సంఘాలకు లేఖ పంపారు. చర్చలకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశం ఉంటుందని ఆ లేఖలో తెలిపారు. స్టీరింగ్ కమిటీ నుంచి 20మంది సభ్యులు చర్చలకు రావొచ్చని లేఖలో తెలిపారు.
మరోవైపు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా.. తాము చర్చలకు రావడం లేదని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంతలో ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కానీ.. అటు ఉద్యోగులు కానీ వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం పట్టుబడుతుంటే.. ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు.
Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పీఆర్సీ జీవోలతో తమకు అన్యాయం జరుగుతుందనేది ఉద్యోగుల వాదన. కొత్త పీఆర్సీ వలన ప్రభుత్వంపై సుమారు రూ.10,500 కోట్ల మేర అదనపు భారం పడుతోందని అలాంటప్పుడు జీతాలు ఎలా తగ్గుతాయనేది ప్రభుత్వ వర్గాల వాదన. తమ డీఏలు, హెచ్ఆర్ఏ, పాత బకాయిలు కలపడం వలనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని.. అవి తమకు రావలసిన బకాయిలు మాత్రమే అనేది ఉద్యోగుల వాదన. తాము అడుగుతున్నట్లు పాత విధానంలోనే తమ జీతాలు చెల్లిస్తే వారి లెక్కల ప్రకారమే ప్రభుత్వంపై పడిన రూ.10,500 కోట్ల భారం తగ్గుతుంది కదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.