AP Ration: ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచే అమల్లోకి.. కేవలం వారికి మాత్రమే హోం డెలివరీ..

రేషన్ షాపుల్లో పారదర్శకత ఉండేలా నిఘా నీడలో ఉండేలా CC కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము.

AP Ration: ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచే అమల్లోకి.. కేవలం వారికి మాత్రమే హోం డెలివరీ..

Updated On : May 20, 2025 / 7:08 PM IST

AP Ration: ఏపీలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9వేల రేషన్ వ్యాన్ లు రద్దు చేసింది. జూన్ 1 నుంచి చౌకధరల దుకాణాల్లోనే రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ పంపిణీపై సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వివరాలు వెల్లడించారు. 9వేల 269 ఎండీయూ వాహనాల కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ట్రయల్ ప్రాజెక్ట్ కు 200 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎక్కడా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.

”ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. PDS రైస్ స్మగ్లింగ్.. వ్యాన్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెరిగింది. 288 కేసులు నమోదు చేశాం. వ్యాన్ ఆపరేటర్లపై వందల కేసులు ఉన్నాయి. సిండికేట్ గా ఏర్పడి ఓ గ్రీన్ చానల్ ను ఏర్పాటు చేసి రైస్ స్మగ్లింగ్. కార్పొరేషన్ నుండి నెలకు 27వేల రూపాయలు వ్యాన్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నాం. 1వ తేదీ నుండి 15వ తేదీ ఉదయం నుండి రాత్రి వరకు రేషన్ షాప్ అందుబాటులో ఉంటుంది.

జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ. రేషన్ షాపుల్లో పారదర్శకత ఉండేలా నిఘా నీడలో ఉండేలా CC కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తాము. వ్యాన్ ఆపరేటర్లకు ఉచితంగా వ్యాన్ ను వారికే అందిస్తున్నాము. దీని ద్వారా రేషన్ అక్రమ రవాణకు కాస్తైనా అడ్డుకట్ట పడుతుంది” అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

 

”ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 30శాతం మందికి రేషన్ బియ్యం అందలేదని తెలిసింది. గతంలో ఇంటింటికీ రేషన్ బియ్యం అందలేదు. ఫేర్ ప్రైస్ షాప్స్ లో రేషన్ పంపిణీ పక్కాగా జరిగేలా మానిటరింగ్ చేసేందుకు కొత్త యాప్ డిజైన్ చేశాం. తర్వాతి దశలో ప్రతి షాప్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారి సర్వీసులు పెంచే విధంగా చూస్తాం. ఫేర్ ప్రైస్ షాపులను కిరాణ షాపులుగా మారుస్తాం.

Also Read: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్.. ఆ సినిమా నిర్మాతకు నోటీసులు.. ఇంకా..

ఆ షాపుల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలో అందించేలా నిర్ణయం తీసుకున్నాం. 9వేల 265 వ్యాన్లు ఎవరి పేరు ఉన్నాయో.. ఉచితంగా వ్యాన్ ని వారికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వారి జీవనాధారంపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు ఈ వ్యాన్స్ ని గూడ్స్ డెలివరికో మరో దానికి ఉపయోగించుకోవచ్చు” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.