Pensions : పెన్షన్ రద్దయిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి

Pensions : పెన్షన్ రద్దయిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

Pension

Updated On : November 18, 2021 / 4:29 PM IST

Pensions : పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తమకు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్లు అందడం లేదని అనేకమంది ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. పెన్షన్ రద్దు అయిన వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుదారుల వివరాలను మరోసారి తనిఖీ చేయాలని నిర్ణయించింది.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

నవశకం సర్వే అనర్హులుగా గుర్తించినవి, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, సచివాలయ పోర్టల్‌లో తిరస్కరణకు గురైన వారికి కొత్తగా దరఖాస్తుకు అనుమతించింది ప్రభుత్వం. సచివాలయాల్లో సంక్షేమ కార్యదర్శులు ఇలాంటి వారి ఆధార్‌ వివరాల ఆధారంగా అర్హతను పరిశీలిస్తారు. దీన్ని ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ల ఆమోదం తర్వాత కొత్తగా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు ఆదేశాలు జారీ చేశారు.