బక్రీద్ నమాజులకు ఈద్గాహ్‌ల్లోకి నో ఎంట్రీ

బక్రీద్ నమాజులకు ఈద్గాహ్‌ల్లోకి నో ఎంట్రీ

Updated On : July 29, 2020 / 3:43 PM IST

మరికొద్ది రోజుల్లో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా జరుపుకోనున్న ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఈద్ – ఉల్ -అదా (బక్రీద్ పండుగ) ప్రార్ధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనల వివరాలు ఇలా ఉన్నాయి.



* బక్రీద్ పండుగ నమాజ్ చేసుకునేందుకు ఈద్గాహ్ మైదానంలో అనుమతి లేదు.
* కోవిడ్ జాగ్రత్తలు నియమాలు మాస్క్ సానీటైజర్ వంటి వాటిని తప్పక అనుసరిస్తూ తమ తమ మస్జీద్ లలో 50 మంది జమాత్‌కి మాత్రమే ఈద్ నమాజ్ చేయుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
* ఒక వేళ మస్జీద్ యొక్క ముసల్లి లు ఎక్కువగా ఉన్నచో రెండవ సారి మిగిలిన వారితో మస్జీద్ లో ఈద్ నమాజ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


* నమాజ్ కి అవసరమైన వజూ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలి, జానీమాజ్ వంటివి ఎవరికి వారు తెచ్చుకోవాలి.మనిషికి మనిషికి తప్పనిసరిగా 2 మీటర్లు (6 ఫీట్) డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి.
* ఇమామ్ ఈద్ ఖుత్బా(ప్రసంగాన్ని) వీలైనంత త్వరగా ముగించాలి.
* చిన్న పిల్లలు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు నమాజ్ ను తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలి.



అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తప్పకుండా ఏపీ ప్రజలు పాటించాలని వక్ఫ్ బోర్డు ముస్లిం సోదరులకు వివరించింది.