Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు..!

AP Govt regularized contract employees in medical department

Updated On : March 7, 2024 / 6:35 PM IST

Contract Employees : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం (మార్చి 7) వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. 2014 ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2,146 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also : Pawan Kalyan : అలాంటి వారి కోసమే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

గతంలో సీఎం జగన్ పాదయాత్ర సమయంలో క్రాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే అర్హులైన వారిని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది, డీఎమ్ఈ పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని రెగ్యులరైజ్ చేసినట్లు సీఎస్ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : 2024 SSC Hall Tickets : తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. పరీక్షలు ఎప్పటినుంచంటే?