స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి : ఏపీ హైకోర్టు

  • Published By: sreehari ,Published On : October 21, 2020 / 03:53 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి : ఏపీ హైకోర్టు

Updated On : October 21, 2020 / 4:33 PM IST

Local body elections : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సహకరించడం లేదని నిధులు విడుదల చేయడం లేదని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏపీ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు.



రూ.40 లక్షల నిధులకు రూ.39 లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల నిర్వాహణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.



దాంతో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఏయే చోట్ల ప్రభుత్వం సహకరించడం లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.