IPS Officers : ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ

IPS Officers : అతుల్ సింగ్‌కు ఎసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పీవీ సునీల్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

IPS Officers : ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ

AP Govt transfer three Senior ips Seniors ( Image Source : Google )

Updated On : June 20, 2024 / 11:11 PM IST

IPS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్చార్జి డీజీపీ కేవి రాజేంద్ర నాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
అతుల్ సింగ్‌కు ఎసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పీవీ సునీల్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

శంకబ్రత బగ్చికి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కౌంటర్ ఇంటెలిజన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎర్ర చందనం టాస్క్ ఫోర్సు బాధ్యతల నుంచి కూడా రిశాంత్ రెడ్డిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : ఆంధ్రుల కలల సౌధాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎలా పూర్తి చేయాలి? చంద్రబాబుకు సవాల్‌గా మారిన రాజధాని నిర్మాణం