Chandrababu : చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు.. ఆ కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుని అప్పటివరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. దాంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. Chandrababu

Chandrababu : చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు.. ఆ కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు

Relief For Chandrababu

Updated On : October 11, 2023 / 6:36 PM IST

Relief For Chandrababu : అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి తాత్కాలిక ఊరట లభించింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుని రేపటి (అక్టోబర్ 12) వరకు అరెస్ట్ చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ సోమవారం (అక్టోబర్ 16) వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

ఈ మేరకు ఈ రెండు కేసుల్లోనూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుని అప్పటివరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. దాంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, చంద్రబాబు పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

చంద్రబాబుని అప్పటివరకు అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడ్వొకేట్ లక్ష్మీనారాయణ స్పందించారు. అసలు కోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చింది? చంద్రబాబుని ఎప్పటివరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది? ఏసీబీ కోర్టుకి ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చింది? అన్న అంశాలపై ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌ రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

”చంద్రబాబుకి యాంటీసిపిటరీ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశాము. ఇవాళ హైకోర్టులో దానిపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అంగళ్లు కేసులో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదని, రేపటికి కేసు వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దానికి సంబంధించి రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. రేపటి వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పీటీ వారెంట్ వేశారు. అలాగే చంద్రబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది 11వ తేదీన ఫైల్ చేశారు. 14వ తేదీన రిటర్న్ అయ్యింది. మళ్లీ 15వ తేదీన ఫైల్ చేయగా.. పెండింగ్ లో ఉంది. లాంగ్ పెండింగ్ ఉన్న విషయాన్ని గమనించిన కోర్టు చంద్రబాబుని సోమవారం వరకు అరెస్ట్ చేయొదని ఆదేశాలు ఇచ్చింది.

యాంటిసిపిటరీ బెయిల్ అంశంపై సోమవారం విచారణ చేపడతామని, అది తేలే వరకు చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటివరకు ఎలాంటి పీటీ వారెంట్స్ ఇవ్వద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును పోలీస్ కస్టడీకి తీసుకోవడం కానీ, అరెస్ట్ చేయడం వంటి చేయడం లేదు అని కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ అండర్ టేకింగ్ ఇచ్చారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేసుని సోమవారం విచారణకు వాయిదా వేసింది హైకోర్టు. యాంటిసిపిటరీ బెయిల్ అంశం తేలే వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది” అని అడ్వొకేట్ లక్ష్మీనారాయణ తెలిపారు.

Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు