Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం అప్పీల్.. నేడే విచారణ

థియేటర్లలో సినిమా టికెట్ రేట్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌‌కు వెళ్లింది.

Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం అప్పీల్.. నేడే విచారణ

High Court (1)

Updated On : December 16, 2021 / 10:20 AM IST

Movie Ticket Rates: థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ఇచ్చిన జీవోకు ముందు అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లలో టిక్కెట్లు అమ్ముకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌‌కు వెళ్లింది.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ల ధరల తగ్గింపు జీవో 35పై నేడు విచారణ చేయనుంది డివిజన్ బెంచ్. థియేటర్ల యజమానులు ఇష్టమొచ్చినట్లు టిక్కెట్ ధరలను పెంచడం వల్లే జీవో నెంబర్-35ను జారీచేసినట్లు చెబుతోంది ప్రభుత్వం.

సినిమా టికెట్ల ధరలు పెంచటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని ప్రభుత్వం సినిమా టికెట్లు నియంత్రించటానికి జీవో 35ను తెచ్చినట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.

Corona Cases : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

ఈ అప్పీల్‌ని అత్యవసర విచారణ జరపాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కోరారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ రాకపోవడంతో విచారణ నేటికి వాయిదా వేసింది.