Junior Doctors Strike : రేపటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె

ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.

Junior Doctors Strike : రేపటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె

Ap Junior Doctors Go To Strike

Updated On : June 9, 2021 / 1:54 PM IST

Junior Doctors : ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు. రేపు యధావిధిగా నిరసన కొనసాగుతుందని జూడాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వనించటంతో, రేపు మరోసారి వైద్యఆరోగ్య శాఖమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో జూడాలు సమావేశం అవుతారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అత్యవసర కేసులకు మాత్రం హాజరవుతామని…చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు.

కరోనా వేళ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగటం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్య భీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎస్‌ఆర్‌కు అందించే స్టయిఫండ్, టీడీఎస్ కటింగ్ లేకుండా చూడాలని, అలాగే వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్ కు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.