Exams in AP: పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశించినట్లే చేస్తాం -ఆదిమూలపు సురేష్‌

రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు.

Exams in AP: పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశించినట్లే చేస్తాం -ఆదిమూలపు సురేష్‌

Exams In Ap

Updated On : June 23, 2021 / 7:05 AM IST

Tenth and Inter Exams: రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని మంత్రి సురేష్‌ వివరించారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

విద్యార్థికి, విద్యార్థికీ మధ్య ఐదడుగుల భౌతికదూరం పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని న్యాయస్థానానికి స్పష్టంచేశారు మంత్రి ఆదిమూలం. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించామని అన్నారు. పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు వివరాలను వెల్లడించినట్లు చెప్పారు.

కేవలం గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్నామని, మార్కులు కాదని సుప్రీంకోర్టుకు తెలిపామని, ఈ వివరాలన్నింటిని అఫిడవిట్ ద్వారా తెలపాలని కోరుతూ.. విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని స్పష్టంచేశారు. పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని సురేష్ తెలిపారు. టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జరిగిన విచారణలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రాగా.. వాటిపై సురేష్ స్పందించారు.