Minister Ambati Rambabu : మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు

ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Minister Ambati Rambabu : మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu

Minister Ambati Rambabu..Nagarjuna Sagar Dam : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి నాగార్జున సాగర్ డ్యామ్ వేదికగా వివాదం చెలరేగింది.నీటి వివాదాలు కొసాగుతున్న క్రమంలో ఏపీ పోలీసుల డ్యామ్ వద్ద వ్యవహరించిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ వివాదంపై ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం చర్య న్యాయమైనదేనని..తమ ప్రభుత్వం ఏమాత్రం తప్పులేదని అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ పోలీసుల చేసింది దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండ యాత్ర అంటూ ప్రచారం చేయటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మా నీటిని మా రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటీ..? అని ప్రశ్నించారు.

నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం .. కేంద్రం ఆరా..

ఈ వివాదానికి చంద్రబాబే కారణం అంటూ విమర్శించారు. ఏపీకి హక్కు ఉన్న ప్రాజెక్టు ప్రాంతంలోకి ఏపీ పోలీసులు వెళితే తప్పేంటి..? అని ప్రశ్నించారు. సాగర్ కు సంబంధించి 13 గేట్లు ఏపీ స్వాధీనంలో ఉన్నాయని అక్కడికి వెళితే తప్పేంటి..మనకు కావాల్సిన నీటిని మనం విడుదల చేసుకుంటే తప్పేంటి.. ? అని ప్రశ్నించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా..?

ఏపీకి రావాల్సిన నీటిని తప్ప ఒక్క నీటి బొట్టును కూడా తాము తీసుకోమని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ అధికారులకు చెబుతున్నానని అర్థం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. మా నీటిని మేం విడుదల చేసుకునే స్వేచ్ఛ తమకు కావాలన్నారు.