Minister Botsa Satyanarayana : ఓపీఎస్ సాధ్యం కాదని ముందే చెప్పాం : మంత్రి బొత్స

ఓపీఎఫ్ సాధ్యం కాదని ముందే చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓపీఎఫ్ తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దానికన్నా మంచి స్కీమ్ కోసం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Minister Botsa Satyanarayana : ఓపీఎస్ సాధ్యం కాదని ముందే చెప్పాం : మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana

Updated On : September 7, 2022 / 4:47 PM IST

Minister Botsa Satyanarayana : ఓపీఎస్ సాధ్యం కాదని ముందే చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓపీఎస్ తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దానికన్నా మంచి స్కీమ్ కోసం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి బొత్స చెప్పారు.

ప్రస్తుత విధానం కంటే మెరుగైన దానికోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు ప్రస్తుత పెన్షన్ విధానం బాగుందేమోనని అన్నారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకుంటే వారి ఇష్టమన్నారు. చర్చలకు వస్తే కదా ప్రభుత్వ నిర్ణయం వారికి తెలిసేదని అన్నారు.

Face Recognition Attendance App : ఫేస్ యాప్.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు సఫలం

మరికాసేపట్లో ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రులు కమిటీ సమావేశం కానుంది. పెన్షన్ పీటముడిపై మంత్రులు చర్చించనున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చర్చలను బహిష్కరించాయి. ఎన్జీవో సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోసియేషన్ చర్చలకు హాజరుకానున్నాయి.

సీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సీపీఎస్ కంటే జీపీఎస్ బెస్ట్ అని ఏపీ సర్కార్ అంటోంది. పెన్షన్ స్కీమ్ పై కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.