Kanna Babu: స్వామిజీ వేషంలో వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి

నుదుటన విభూది, కళ్లను పోల్చుకోకూడదని కూలింగ్ గ్లాసులు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో పూర్తిగా స్వామీజీ గెటప్ లో ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు వైకాపా ఎమ్మెల్యే.

Kanna Babu: స్వామిజీ వేషంలో వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి

Kannababu

Updated On : December 22, 2021 / 10:07 AM IST

Kanna Babu: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మారు వేశంలో వచ్చారు మంత్రి. నుదుటన విభూది, కళ్లను పోల్చుకోకూడదని కూలింగ్ గ్లాసులు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో పూర్తిగా స్వామీజీ గెటప్ లో ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు వైకాపా ఎమ్మెల్యే.

ప్రజల సమస్యలపై ఆరాతీసేందుకు అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. వైకాపా పాలనలో ప్రజలకు అందుతున్న నవరత్నాల గురించి ప్రజలేమనుకుంటున్నారని ఆరా తీశారు ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు).

నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉన్నాయని, రోడ్లు సైతం బాగాలేవని చెప్పుకున్నారు. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరిగి ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు విన్న తర్వాత తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు మారువేషంలో వెళ్లిన కన్నబాబు సమస్యలపై మాట్లాడారు.

…………………………..: విలీనం దిశగా జీ-సోనీలకు అప్రూవల్

విషయాలు చెప్పి వివరణ అడుగుతున్నారు. మీరెవరంటూ తహసీల్దార్‌ రాంబాయి ప్రశ్నించేసరికి వేషం తొలగించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు 100 శాతం ఆనందంగా ఉన్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.