జగన్ దెబ్బకు బాబు గ్యాలరీకి పరిమితం : శాసనసమండలి ఉంచాలా ? తీసేయాలా ? 

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 10:55 AM IST
జగన్ దెబ్బకు బాబు గ్యాలరీకి పరిమితం : శాసనసమండలి ఉంచాలా ? తీసేయాలా ? 

Updated On : January 23, 2020 / 10:55 AM IST

శాసనమండలిని ఉంచాలా ? తీసేయాలా ? అన్నదానిపై ఆలోచన చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీ శాసనసభలో సూచించారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు..జగన్ దెబ్బకు ఎగిరి గ్యాలరీలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఈసారి చంద్రబాబును శాసనసభలో కాకుండా..గ్యాలరీకే పరిమితం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నారా లోకేష్‌కు ఎమ్మెల్సీ అయ్యే అర్హత లేదన్నారు.

శాససమండలిలో జరిగిన పరిణామాలపై 2020, జనవరి 23వ తేదీ గురువారం చర్చించారు. రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను ఏపీ శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీంతో శాసనమండలి ఉంచాలా ? వద్దా అనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ…ఎన్టీఆర్ హాయాంలో మండలి రద్దు చేశారని, తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత మండలిని పునరుద్ధరించారనే విషయాన్ని గుర్తు చేశారాయన. ప్రస్తుతం శాసనమండలిలో కొంతమంది మంచి వ్యక్తులున్నారని, రద్దు చేస్తే వారి విషయంలో సీఎం జగన్ ఆలోచించాలని సూచించారు. 

శాసనమండలి అంటే టీడీపీ నేతలకు గౌరవం లేదన్నారు. పెద్దల సభ అంటే..150 కేజీల బరువు ఉన్న వాళ్లు ఉండే సభ అనుకుంటున్నారని తెలిపారు. శాసనమండలిలో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ పరిశీలిస్తే..తెలుస్తుందన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్‌..టీడీపీకి వీర విధేయుడని గుర్తు చేశారు. పెద్దల సభలో ఉన్న వారు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. తప్పు జరిగింది..రూల్ ప్రకారం..తీసుకోలేదు..పొరపాటు చేశాను..కాని అధికారాన్ని ఉపయోగించుకుని మరో తప్పు చేస్తున్నా.. అని ఛైర్మన్ అన్నారన్నారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. 

Read More : ఏపీలో శాసనమండలి అవసరమా ? ఆలోంచాలి – ధర్మాన