వీటికి గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అందుకే ఈ పరిస్థితి: మంత్రి నిమ్మల రామానాయుడు
"మళ్లీ మొదటి నుంచి మేము పనులు ప్రారంభించాలి" అని తెలిపారు.

Nimmala Rama Naidu
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ నిర్వహించిన మెగా ఈవెంట్ “షైనింగ్ ఏపీ”లో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అసాధ్యాలను సుసాధ్యం చేశామని తెలిపారు.
“నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. ఆ రైతులకు ఇరిగేషన్ శాఖ ద్వారా సేవ చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం నాకు చంద్రబాబు నాయడు ఇచ్చారు. దాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ఉంది. వెలిగొండ ప్రాజెక్టును నేను విజిట్ చేస్తున్నాను. మేము రివ్యూలు చేస్తున్నాం.
ప్రకాశం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఫ్లోరైడ్ వాటర్ ఉంది. 20 – 30 కిలోమీటర్లు నడిచి మహిళలు బిందెలతో నీళ్లు మోస్తున్న పరిస్థితి ఉంది. గత వైసీపీ గవర్నమెంట్ వెలిగొండని పూర్తి చేశామని చెప్పుకుంది. వెలిగొండని జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు.
నేను ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ అంటే స్టార్టింగ్ హెడ్ వర్క్స్ వాల్స్ గాని వింగ్స్ గాని అక్కడ నిర్మాణం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నో పనులు చేయాల్సి ఉంది. ఏడు ఎనిమిది నెలలు పనులకు పడుతుంది. కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది.
Also Read: ఏపీలో అసాధ్యాలను సుసాధ్యం చేశాం: కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
హెడ్ వర్క్స్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే టన్నెల్ ఉంది. టన్నెల్ వన్ ఉంది. ఈ టన్నెల్ కి సంబంధించి అక్కడ ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే టన్నెల్ 2లో.. టన్నెల్ బోరింగ్ మిషన్ అని చెప్పి ఆ రోజు లైనింగ్ కోసం తీసుకొచ్చారు. అది అందులో చిక్కుబడిపోయింది అది పాడైపోయింది.
దాన్ని డిస్మాటిల్ చేసి ఎట్లా బయటికి తీసుకురావాలి. అది కోర్టులో వివాదం ఉంది. దాన్ని బయటికి తీసుకురాకుండా నీరు ఒక చుక్క కూడా ముందు వెళ్లే పరిస్థితి లేదు. ఇన్ని అవంతరాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 2026 జూన్ కల్లా ఆ వెలిగొండ ఫస్ట్ ఫేస్ ని పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్లాలని ఏదైతే లక్ష్యంగా పెట్టారు.
ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎవ్రీ డే మేము పనులు చేస్తాం. హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి బడ్జెట్లో 3800 కోట్ల రూపాయలు ఇచ్చారు. రాయలసీమకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో టార్గెట్లు పెట్టుకున్నాం. గతంలో ఎంత అన్యాయం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి 2019 – 2024 మధ్య ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కి ఇవ్వలేదు. ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టిని కూడా తీసిన పరిస్థితి లేదు.
మరోవైపు, వైసీపీ 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి అప్పట్లో ఒక్క రూపాయి కూడా జగన్ బడ్జెట్లో ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చింతలపూడి ఎత్తుపోతలకు సైతం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఎన్నో సమస్యలు సృష్టించారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. పనులు పూర్తి చేద్దామంటే గత ప్రభుత్వం నిలిపేసి అగమ్య గోచరం చేసింది. మళ్లీ ఇప్పుడు పనులను దారిలో పెట్టడానికి మళ్లీ ఈసీ క్లియరెన్స్ చేసుకోవడానికి మళ్లీ మొదటి నుంచి మేము పనులు ప్రారంభించాలి” అని తెలిపారు.