AP Film Tickets : సినిమా టికెట్ల రగడ, డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదనలు ఇవే

టికెట్ల రేట్లపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రతిపాదనలు పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను...

AP Film Tickets : సినిమా టికెట్ల రగడ, డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదనలు ఇవే

Ap Minister

Updated On : December 28, 2021 / 2:35 PM IST

Perni Nani And Film Distributors : అమరావతిలో ఏపీ మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. 24 మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో టికెట్‌ రేట్ల వ్యవహారంతో పాటు థియేటర్లలో తనిఖీలపై మంత్రి పేర్ని నానితో చర్చించారు. కాసేపటి క్రితం భేటీ ముగిసింది. ఈ సందర్భంగా టికెట్ల రేట్లపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రతిపాదనలు పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాని దృష్టికి తీసుకెళ్లారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో ఇబ్బందులు పడుతున్నామని ఆయనతో తెలిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడిపే పరిస్థితి లేదని.. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు సమాచారం.

Read More : TRS MLA Jeevan Reddy: కేంద్రానికి వరి ఉరి కాబోతుంది: జీవన్ రెడ్డి

ఇక డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

కార్పొరేషన్లలో ఏసీ థియేటర్ లో హయ్యర్ క్లాస్ కు రూ. 150
ఏసీ లోయర్ క్లాస్ కు రూ. 50 ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.
కార్పొరేషన్లలో నాన్ ఏసీ థియేటర్ లో హయ్యర్ క్లాస్ కు రూ. 100, నాన్ ఏసీ లోయర్ క్లాస్ కు రూ. 40గా ఉండాలన్నారు.
  ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ కు రూ. 100గా నిర్ణయించాలని కోరారు. ఏసీ లోయర్ క్లాస్ కు రూ. 40 ఉండే విధంగా చూడాలన్నారు.
మిగతా చోట్ల నాన్ ఏసీ థియేటర్ లో హయ్యర్ క్లాస్ కు రూ. 80, నాన్ ఏసీ లోయర్ క్లాస్ కు రూ. 30గా ఉండాలన్నారు.

Read More : AP Pensioners : న్యూ ఇయర్ గిఫ్ట్…జనవరి 01వ తేదీ నుంచి రూ. 2500 పెన్షన్

దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ వేయడం జరిగిందని గుర్తు చేశారు. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలను కమిటీ నిర్ధారిస్తుందన్నారు.