దగ్ధం చేయడం అంటే చంద్రబాబుకి సరదా.. తుని రైలు, దేవుడి రథాల దగ్ధం వెనుకున్నది ఆయనే

అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దగ్ధం చేయడం అంటే చంద్రబాబుకి సరదా అన్న మంత్రి వెల్లంపల్లి.. తుని రైలు, దేవుడి రథాల దగ్ధం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు.
అంతర్వేది ఘటనలో బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్, చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. భక్తులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాలను రాజకీయాలు చేసే సంస్కృతి మాది కాదు మీది అని ఫైర్ అయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనను సీబీఐకి అప్పగించామని, త్వరలోనే వాస్తవాలు బయటికి వస్తాయని మంత్రి చెప్పారు.
https://10tv.in/pawan-lit-a-lamp-and-protested-chiru-wife-surekha-support/
చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరని, ఎన్ని గుళ్లకు తిరిగినా ఆయన పాపాలు పోవని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. ”19-10-2017 కె. పంటపాడులో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై చంద్రబాబు, బీజేపీ, జనసేన ప్రశ్నించ లేదు. అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు.
అంతర్వేది ఘటన కేసును సీబీఐకి అప్పగించాం. దేవాలయాల దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవు. 40 దేవాలయాలను కూల్చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన హయాంలోని భూ దోపిడీని ఎందుకు ప్రశ్నించరు?. చేయని తప్పులను కూడా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇలాంటి దుర్మార్గపు పనులను ఎవరూ సమర్థించొద్ద’’ని మంత్రి కోరారు.